‘‘నాకు చిన్నప్పటినుండి తోటమాలిగా, రైతుగా ఉండాలంటేనే ఇష్టం. అందుకే ఎక్కువ శాతం నేను గార్డెన్‌లోనే గడుపుతాను’’ అంటూ పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరోసారి తన మనస్సులోని మాటాలను చెప్పుకొచ్చాడు. సినిమాల్లో ఎంత పెద్ద డ్యాషింగ్‌ స్టార్‌ అయినా, గంటన్నర ఇంటర్యూలో కేవలం పవన్‌ కళ్యాణ్‌ కేవలం ఐదు నిమిషాలే సినిమాల గురించే మాట్లాడాడు. ఒక ఆంగ్లపత్రికకు తొలిసారిగా ఇంటర్యూ ఇచ్చిన పవర్‌ఫుల్‌ హీరో, ఇంకా ఏం చెప్పాడంటే..
17 ఏళ్ళ సినిమా కెరియర్‌లో డజనుకు పైగా 100 రోజులు ఆడిన సినిమాలు ఉన్నాసరే, పవన్‌ ఎందుకో సినిమాలకంటే తన వ్యక్తిత్వం, ఫిలాసఫీల గురించి మాట్లాడటానికే ఎక్కుగా ఇంట్రెస్ట్‌ చూపిస్తాడు. ‘‘నేను ఎప్పటికప్పుడు నిజమైన పవన్‌ కళ్యాణ్‌ గురించి అన్వేషిస్తుంటాను’’ అని చెబుతూ, స్కూల్లో ఎంత యావరేజ్‌ కిడ్‌ అయినాసరే బయట మాత్రం ఏకసంతాగ్రాహిలా ప్రపంచ విషయాల గురించి తెలుసుకుంటూనే ఉంటాడు పవన్‌. ‘‘మనకు ఇతరుల మీద పవర్‌ ఉండదు. కేవలం మనల్ని మనం మార్చుకోవడానికి మనకి పవర్‌ ఉంటుంది’’ అని తన సాఫ్ట్‌ నేచర్‌ను బయటపెట్టాడు.
ఇక ప్రస్తుత రాజకీయాలు, పరిస్థితులు గురించి మాట్లాడుతూ ‘‘నాకు అన్యాయంపై స్పందించకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంది. అందుకే ప్రతీ చిన్న విషయాన్ని కూడా చాలా సీరియస్‌గా పట్టించుకుంటాను’’ అన్నాడు పవన్‌. మరి రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు అని అడిగితే మాత్రం, ‘‘అసలు నేను రాజకీయాల నుండి దూరంగా ఎప్పుడు వెళ్ళాను చెప్పండి?’’ అంటూ మైండ్‌ బ్లోయింగ్‌ సమాధానం చెప్పాడు. సో, పవన్‌ ఇంకా చిరంజీవితోనే తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లు మన స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు.

0 comments:

Post a Comment

 
Top