14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న సినిమా 'నేనొక్కడినే'. మహేష్, కృతిసనన్ జంటగా నటిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ దర్శకుడు. జనవరి 10 న సినిమాని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
అయితే ఇటీవల ఈ సినిమా విడుదల పై సందేహలు నెలకొన్న నేపధ్యంలో విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో డిసెంబర్ 19న విడుదల చేయనున్నారట. అదే విధంగా సినిమాని కూడా జనవరి 10నే విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారట.
0 comments:
Post a Comment