ఇప్పటికే ఎన్నో సంచలనాలతో తెరకెక్కుతున్న బాహుబలి సినిమా కొత్త విషయం తెలుస్తూ మరింత క్రేజ్ పెరుగుతుంది. ఇప్పుడు మరో హీరో నటించేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. ఇంతకి ఆ హీరో ఎవరో కాదు లేటెస్ట్ గా ప్రేమ కథ చిత్రంతో మంచి క్రేజ్ తెచుకున్న సుదీర్ బాబు. ప్రస్తుతం టాలీవుడ్ లో సుదీర్ నిలబెట్టే ఉద్దేశంతో మహేష్ బాబు తన బావ సుధీర్ మంచి బ్రేక్ ఇచ్చే ఉద్దేశ్యంలో రాజమౌళి బాహుబలి సినిమాలో ఒక ముఖ్య పాత్ర ఇమ్మని మన జక్కన్నను అడిగాడని తెలిసింది. మహేష్ ఇలా అడగడంతో రాజమౌళి కూడా ఈ విషయమై సీరియస్ గా ఆలోచిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే సన్నంగా ఉండే సుధీర్ బాబు ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ సినిమా కోసం కండలు బాగా పెంచాడు. ఈ బాడీ రాజమౌళి ‘బాహుబలి’ కోసమే అని అంటున్నారు సిని జనాలు. మరి ఈ న్యూస్ పట్ల రాజమౌళి ఎలా స్పందిస్తాడో చూడాలి. ఒకవేళ ఈ వార్త నిజం అయితే సుధీర్ సుడి తిరిగి నట్లే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

0 comments:

Post a Comment

 
Top