రూపు తేరా మస్తానా అంటూ అపుడెప్పుడో చిరంజీవి సినిమాలో పాట పాడిన బాబా సెహెగల్, తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా జల్సా లో కరో కరో జల్సా అంటూ మళ్ళీ మెరిశాడు. తాజాగా వీడు ఆరడుగుల బుల్లెట్టు పాట తో సంచలనం సృష్టిస్తున్నాడు. పాట లకే పరిమితం అనుకున్న దశలో మంచు ఫ్యామిలి నటిస్తున్న '' పాండవులు పాండవులు తుమ్మెద '' చిత్రంలో నలుగురితో కలిసి సంగీతం కూడా అందిస్తున్నాడు. తాజాగా నటన పై ద్రుష్టి పెట్టిన బాబా సెహెగల్ గుణశేఖర్ ప్రతిష్టాత్మక చిత్రం ''రుద్రమదేవి'' లో విలన్ గా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడట......! అనుష్క, రానా నటిస్తున్న ఈ చిత్రం లో బాబా సెహెగల్ ఆహార్యానికి తగ్గట్లుగా పాత్ర అద్భుతంగా వస్తోందట.....! బాబా మంచి దేహ దారుడ్యo కలిగి ఉండటం తో ఆపాత్రకు తీసుకున్నారట గుణ శేఖర్. పాటలతో బాక్స్ బద్దలు కొడుతున్న బాబా సెహెగల్ ఇక నటన తో ఆకట్టుకుంటాడన్నమాట.....!

0 comments:

Post a Comment

 
Top